Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'టాప్ ఫోర్' కు ఎక్కుపెట్టిన సన్ రైజర్స్

వరుసగా రెండు పరాజయాలతో పాయింట్ల పట్టికలో కిందకు జారిన సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్ళీ టాప్ ఫోర్ కు ఎగబాకాలని భావిస్తోంది. ఈ క్రమంలో నేడు ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ సన్ రైజర్స్ కు కీలకం కానుంది. సన్ రైజర్స్ ప్రస్తుతం 9 మ్యాచ్ లాడి 5 విజయాలు, 4 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో ఉంది. కాగా, సొంత గడ్డపై ఈ మ్యాచ్ ఆడనుండడం సంగక్కర బృందానికి సానుకూలాంశం. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మ్యాచ్ కు వేదిక. మరికాసేపట్లో ఆరంభమయ్యే పోరులో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

More Telugu News